నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి

  • కొమురంబీమ్ జిల్లాలో సీఎం పర్యటన
  • కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం
  • రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ
నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించారు. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరూ ఇళ్లను నిర్మించుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే లక్ష ఇళ్లను ప్రారంభిస్తామని అన్నారు.

Revanth Reddy
Indiramma houses
Telangana
Telangana CM
Komurambheem Asifabad district

More Telugu News